
Work From Home: వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సర్వే గణాంకాలు తప్పక తెలుసుకోండి..
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి నుండి పని చేసే విధానం(వర్క్ ఫ్రం హోమ్) ప్రారంభం అయింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక కంపెనీలలో తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేసే విధంగా ఆదేశించారు.
1/
8
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి నుండి పని చేసే విధానం(వర్క్ ఫ్రం హోమ్) ప్రారంభం అయింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక కంపెనీలలో తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేసే విధంగా ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/
8
అయితే, కోవిడ్ కేసులు తగ్గిన వెంటనే.. పరిస్థితి మళ్లీ ట్రాక్‌లోకి రావడం ప్రారంభించింది. ఫలితంగా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడం ప్రారంభించాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ నిలిపివేయబడింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/
8
అయితే.. ఇప్పుడు ఓ సర్వేలో షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి. ఇంటి నుండి పని చేసిన తర్వాత రాజీనామాలు పెరిగాయని చెప్పారు. HR సొల్యూషన్స్ సంస్థ Aon ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/
8
ఈ ఏడాది కంపెనీలు ఇంటి నుంచి పనిచేయడం మానేశాయని సర్వే తెలిపింది. అదే సమయంలో రాజీనామాల సంఖ్య కూడా పెరినట్లు సర్వేలో తెలిసింది. ఎకనామిక్ టైమ్స్ షేర్ చేసిన డేటా ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లను రద్దు చేసిన తర్వాత 29 శాతం మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/
8
అదే సమయంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ వర్క్ మోడల్ (ఇంటి నుండి పని లేదా రిమోట్ వర్క్)ను స్వీకరించిన కంపెనీలు 19 శాతం వరకు రాజీనామాలను కలిగి ఉన్నాయి.
(ప్రతీకాత్మక చిత్రం)
6/
8
ఇంటి నుండి పని ముగించడం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని ఇది చూపిస్తుంది. అందుకే కంపెనీలకు ‘బై బై’ చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/
8
భారతదేశంలోని 9 శాతం కంపెనీలలో WFH
AON సర్వేలో 700 కంపెనీలు పాల్గొన్నాయి. అన్ని కంపెనీల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ క్రమంగా ఆపేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/
8
ఆగస్టులో, భారతదేశంలో కేవలం 9 శాతం కంపెనీలు మాత్రమే పూర్తిగా ఇంటి నుండి పని చేశాయి. జనవరిలో ఇలాంటి కంపెనీల సంఖ్య 38 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి నుండి పని చేసే విధానం(వర్క్ ఫ్రం హోమ్) ప్రారంభం అయింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక కంపెనీలలో తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేసే విధంగా ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)